BRS | బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలు కప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాలకుర్తి మండలం, తొర్రూరు గ్రామ సీనియర్ కాంగ్రెస్ నేతలు యాదవ సంఘం అధ్యక్షులు భిక్షపతి, గ్రామ పార్టీ అధ్యక్షులు పసులది ఎల్లయ్య, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు సంగం భాస్కర్, కాంగ్రెస్ మాజీఎంపీటీసీ చిలువేరు పెంటయ్య సహా సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, కొండాపురం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలకుర్తిలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమక్షంలో BRS పార్టీ లో శనివారం చేరారు. వాళ్లందరికీ మంత్రి ఎర్రబెల్లి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Koppula
మరోవైపు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి చెందిన 50 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మెదక్ జిల్లా బూరుగుపల్లి బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు వడ్ల రమేశ్ సహా 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
