హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు రగలుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి చేసి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు పరాయి వాళ్లలా చూస్తూ అవమానిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై(Adluri Laxman Kumar) ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి వెంట ఉండి అన్నీ అమ్ముకొని గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకులను మర్చిపోయాడని మండిపడుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా తమ ఆక్రోషాన్ని వెల్లగక్కుతున్నారు. తాజాగా నియోజకవర్గంలోని వెల్గటూర్ మండలం వెంకటపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోటయ్య సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అధికారంలోకి రాగానే లక్ష్మణ్ కుమార్ పూర్తిగా మారిపోయాడు. ధర్మపురి నియోజకవర్గంలో రెడ్డి వర్గమే నడుస్తుంది. రెడ్డీలు చెప్తేనే పని అవుతుందన్నారు.
సామాన్య, మధ్యతరగతి వాళ్లను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పట్టించుకోవడం లేదు.. కనీసం ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు. ధర్మపురి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తీవ్ర అవమానం జరుగుతుంది. ఎవరు బైటకి చెప్పుకోలేక లోలోపల బాధపడుతున్నారని తెలిపారు. కష్టపడ్డ వారిని కాకుండా మమ్మల్ని అవమానపరిచిన వారికి పనులు చేస్తుండు. బీసీలను మొత్తానికే పక్కకు పెట్టి రెడ్డీలు రాజ్యమేలుతున్నారని కోటయ్య వాపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీరు పై కాంగ్రెస్ కేడర్ ఆవేదన
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంట ఉండి గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకులను మర్చిపోయాడని అవేదన
సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన వెల్గటూర్ మండలం వెంకటపూర్ గ్రామ… pic.twitter.com/x4YsdMBeZD
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2024