వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఉదంతం మరవకముందే స్టేషన్ ఘన్పూర్(Station Ghanpur) కాంగ్రెస్లో ముసలం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై(MLA Kadiam Srihari) ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు(Congress activists) గుర్రుగా ఉన్నారు. మొదటి నుంచి కడియం రాకను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు సందర్భం వచ్చిన ప్రతిసారి కడియంకు వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉన్నారు.
తాజాగా పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి కాకుండా.. కడియం శ్రీహరి వర్గీయులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ధర్నా చేపట్టారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాలో అంతర్గతపోనును పరిష్కరించలేక కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్టీలో అసంతృప్త జ్వాలలు చెలరేగుతుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి స్థానిక కాంగ్రెస్ నేత సింగాపురం ఇందిర మద్దతుదారులు ధర్నా చేపట్టారు.
పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో మొదటి నుండి… pic.twitter.com/Z2WSaXhlj1
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2024