గురుకులంలో సెక్రటరీ ఆదేశాలూ బేఖాతర్.. ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ నియామకంలో మార్గదర్శకాలు తుంగలోకి
తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీలో సెక్రటరీ జారీచేసిన మార్గదర్శకాలకు దిక్కులేకుండా పోయింది. కిందిస్థాయి ఉద్యోగులే ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమాత్యుడున్నా లేనట్టుగా పరిస్థితి తయారైందని, ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నవారే లేరని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి.
- సీనియార్టీని పక్కనపెట్టి జూనియర్లకు ప్రిన్సిపాల్స్‌గా నియామకం
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎస్సీ గురుకుల సొసైటీలో సెక్రటరీ జారీచేసిన మార్గదర్శకాలకు దిక్కులేకుండా పోయింది. కిందిస్థాయి ఉద్యోగులే ఇన్చార్జి ప్రిన్సిపాల్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమాత్యుడున్నా లేనట్టుగా పరిస్థితి తయారైందని, ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్నవారే లేరని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కాలేజీల్లో మొత్తం 150 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో వర్కింగ్ ఆరేంజ్మెంట్ కోసం ఇన్చార్జి ప్రిన్సిపాల్స్‌ను నియమించాలని సూచిస్తూ ఇటీవల సెక్రటరీ సర్క్యులర్ జారీచేశారు. ఆయా గురుకులంలో సీనియర్ జేఎల్, పీజీటీ, టీజీటీను ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా నియమించాలని నిబంధన విధించారు. వారు సుముఖంగా లేకపోతే, రాతపూర్వక అంగీకారం తీసుకొని, సీనియర్‌కు బాధ్యత ఇవ్వాలని స్పష్టంచేశారు.
కొడంగల్‌లో నిబంధనల పాతర
గురుకుల సెక్రటరీ జారీచేసిన సర్క్యులర్‌కు విరుద్ధంగా జోనల్ ఆఫీసర్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్స్‌ను నియమిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. 50 పోస్టుల్లో సీనియర్ల నుంచి అంగీకార పత్రాలను తీసుకోకుండానే జూనియర్లకు, అదీ సీనియార్టీ జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న వాళ్లకు ప్రిన్సిపాల్ బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తున్నది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. చేర్యాల, బెల్లంపల్లి, మధిర, తిరుమలాయపాలెం ఇలా దాదాపు 50 చోట్ల జోనల్ ఆఫీసర్లు నిబంధనలకు పాతరేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జోనల్ ఆఫీసర్ల తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పేరెంట్స్ కమిటీలు మండిపడుతున్నాయి. సెక్రటరీ ఉత్తర్వులను అటకెకించడం వెనుక ప్రధాన కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెడ్‌ఆఫీస్‌లోని పలువురు అధికారుల అక్రమాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, అనేకమార్లు ఫిర్యాదు చేసినా అమాత్యుడు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని, సర్యులర్ అమలయ్యేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

