హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో డ్రైవర్ డ్యూటీ 8 గంటలే.. సిబ్బంది కొరత కారణం గా ఒకొకరు సుమారు 14 గంటలపాటు పనిచేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. ఇదే దశలో ముందుచూపు లేకుండా రాష్ట్ర సర్కారు అమలుచేసిన మహాలక్ష్మి పథకంతో బస్సులు ఓవర్‌లోడ్‌తో నడపాల్సి వస్తున్నది. ఇటీవల ప్రయాణికుల ఓవర్‌లోడ్ కారణంగా నడుస్తున్న బస్సుల చక్రాలు, పరికరాలు ఊడిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి దాపురించింది. 50 మంది ఎక్కాల్సిన కరీంనగర్ డిపో బస్సులో 170 మంది ఎకారు. ఓవర్‌లోడ్ కారణంగా బస్సు వెనుకా ల రెండు టైర్లు ఊడిపోయాయి. ఈ సమయంలో బస్సులో ఎకువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. నారాయణపేట జిల్లా ఉటూరులో బస్సు రన్నింగ్‌లో ఉండగా బస్సు పార్టులు ఊడిపోయి రోడ్డుపైన పడ్డా యి. ఆయా ఘటనల్లో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే.. తలుచుకుంటేనే ఒళ్లుగగుర్పొడుస్తున్నది. ఈ రెండు చోట్లే కాకుండా మరికొన్ని చోట్ల ఓవర్‌లోడ్ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆర్టీసీలో రాష్ట్రవ్యాప్తం గా సుమారు 600 వరకు డ్రైవర్ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ విషయంలో జాప్యం జరుగుతుండటంతో ఉన్న డ్రైవర్లపై పనిఒత్తిడి పెరుగుతున్నది. రద్దీకి అనుగుణంగా 3 వేల కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలని కార్మికుల జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, ప్రతినిధి థామస్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే కొంత ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జర్నలిస్టు కర్రి శ్రీరాంను నియమిస్తు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఈవో స్పెషల్ సెక్రటరీ ఎం హనుమంతరావు స్పష్టంచేశారు.