KCR Birthday | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇతరులకు సహాయపడేలా కార్యక్రమాలని నిర్వహించాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. రక్తదాన శిబిరాలు, పండ్ల పంపిణీ, అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలకు పిలుపు
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్… pic.twitter.com/r2AWX2Jhry
— BRS Party (@BRSparty) February 15, 2025