హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో మే 2 నుంచి 6 వరకు నిర్వహించనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలను సజావుగా నిర్వహించాలని మంగళవారం సంబంధిత అధికారులను ఎస్సీఆర్ జీఎం ఆదేశించారు. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. పరీక్షలకు సకాలంలో హాజరు కావాలని పేర్కొన్నారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మొత్తం 11,588 పోస్టులు ఉన్నాయని తెలిపారు.