రవీంద్రభారతి, నవంబర్ 21: కవి, రచయిత అందెశ్రీ సంతాపసభను శనివారం రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2గంటలకు నిర్వహిస్తున్నట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రవీంద్రభారతిలోని సాహిత్య అకాడమీలో సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు. సంతాపసభకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు హాజరవుతారని పేర్కొన్నారు.