హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : పోలీసులను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ నియంత పాలన సాగిస్తున్నదని, ప్రజాపాలన పేరిట రౌడీపాలన చేస్తున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ అధికారిక క్యాంపు కార్యాలయాల్లో ఆనాటి సీఎం కేసీఆర్ ఫొటో పెట్టుకున్నారా? నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో ఎందుకు పెట్టాలో చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రొటోకాల్ ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలోని తన చాంబర్లో ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఫొటో పెట్టుకున్నారని ప్రశ్నించారు.
సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో కాంగ్రెస్ గూండాలను అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజాక్షేత్రం లో ఎండగడుతున్నారనే అక్కసుతో కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నిట్టనిలువు నా ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందని గుర్తుచేశారు. దీనికి రేవంత్ సరార్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు ‘ఎవ్రీ డే ఈజ్ నాట్ సండే’ అని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు కావాలనే బీఆర్ఎస్ నేతలతో కయ్యం పెట్టుకుంటున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం ఫొటో పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం దాన్నే సూచిస్తున్నదని తెలిపారు. దానిని అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లా ఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.