e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన

మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన

మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన

రామచంద్రాపురం/సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతి సాధిస్తూ అభివృద్ధిలో ముందుకెళ్తుందని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 111 భారతీ నగర్ డివిజన్‌లో మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత పాలకుల నిర్లక్ష్యంతో అనేక ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైదరాబాద్ మహానగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు.


పట్టణ ప్రజలకు రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం మోడల్ రైతు బజార్లను నిర్మిస్తుందన్నారు. భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ ప్రజలకు అన్ని రకాల కూరగాయలు, పండ్లు, నాన్ వెజ్ మార్కెట్ అన్ని ఒకే చోట లభించే విధంగా మోడల్ రైతు బజార్‌ను ఏర్పాటు చేసుకుంటుండటం శుభపరిణామమని తెలిపారు.

- Advertisement -

సుమారుగా రూ. 3 కోట్ల రూపాయలతో మోడల్ రైతు బజార్ నిర్మించబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్ సింధూఆదర్శ్ రెడ్డి, ఆర్సీపురం కార్పొరేటర్ పుష్ప, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్‌. రమణ

చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ

5.5 లీటర్ల నాటుసారా స్వాధీనం

షాకింగ్ : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల చిత్రాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన
మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన
మోడల్ రైతు బజార్ నిర్మాణానికి శంకుస్థాపన

ట్రెండింగ్‌

Advertisement