కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమకొండలోని కేంద్ర గ్రంథాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.