హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad airport) నుంచి తిరుపతికి (Tirupati) వెళ్లాల్సిన విమానాన్ని చివరి నిమిషంలో సాంకేతిక (Technical) కారణాలతో వాయిదా వేశారు. 4
7 మంది ప్రయాణికులతో వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలుగా సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉన్నారు. చివరకు ఆరా తీయడంతో సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు (Passengers) విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తిరుమల దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు.