కోదాడటౌన్, సెప్టెంబర్ 27 : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రా మం, అనంతగిరి మండలం గోండ్రియా ల చెందిన వరద బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు కోదాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నష్టపోయిన బాధితులను వదిలేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారినే అధికారులు జాబితాలో చేర్చారని, రేషన్ కార్డు లేకుంటే కూడా నష్టపరిహా రం రాదని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కోదాడ మం డల ప్రధాన కార్యదర్శి శెట్టి సురేష్ నా యుడు మాట్లాడుతూ వరదల కారణంగా సర్వం కోల్పోయి దిక్కుతోచని అయోమ య స్థితిలో ఉన్న బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్పీడీసీఎల్లో బదిలీల నిషేధం ఎత్తివేత ; అక్టోబర్ 4లోగా ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం
హనుమకొండ, సెప్టెంబర్ 27: టీజీఎన్పీడీసీఎల్ ఉద్యోగులకు శుభవార్త. బదిలీల నిషేధం ఎత్తివేస్తూ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల పరిధిలో బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ జారీ చేశారు. అక్టోబర్ 4లోగా బదిలీ ఫోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్గదర్శకాల ప్రకారం 30 జూన్ 2024 నాటికి రెండేండ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులు. ఏడాదిలోపు పదవీ విరమణ పొందేవారికి బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రత్యేక కారణాలు గలవారు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకొంటే పరిశీలిస్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని క్యాటగిరీల ఉద్యోగులకు బదిలీలు జరుగనున్నాయి. నిబంధనల ప్రకారం ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి బదిలీ పోర్టల్లో 28లోగా పొందుపరుచాలి. అభ్యంతరాలు ఉంటే 30వ తేదీలోగా ఫిర్యాదు చేయాలి. అక్టోబర్ 4న బదిలీ చేసే అథారిటీ అధికారులకు ట్రాన్స్ఫర్ దరఖాస్తులను అందజేయాలి. ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులు అక్టోబర్ 7లోగా జారీ చేయాలి. బదిలీ అయిన ఉద్యోగులు ఆయా స్థానాల నుంచి అక్టోబర్ 9వ తేదీలోగా రిలీవ్ కావాల్సి ఉంటుందని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు. అక్టోబర్ 8వ తేదీ నుంచి బదిలీల నిషేధం మళ్లీ అమలులోకి వస్తుందని సీఎండీ తెలిపారు.