బజార్హత్నూర్, సెప్టెంబర్ 24 : వ్యవసాయానికి సాగు నీరు(Cultivation water) అందించాలని రైతులు రోడ్డుకు కట్టెలు అడ్డుగా పెట్టి నిరసన(Farmers concern) తెలిపారు. రైతుల ఆందోళనతో దెబ్బకు దిగివచ్చిన అధికారులు నీటిని విడుదుల చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామ రైతులు సాగు నీరును అందించాలని నిరసన తెలిపారు. గిర్నూర్ గ్రామ సమీపంలోని ఆర్అండ్బీ ప్రధాన రహదారైన ఇచ్చోడ-సోనాల రోడ్డుపై మంగళవారం దాదాపు వందకుపైగా మంది రైతులు కాలువల ద్వారా సాటిని విడుదల చేయాలని ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పదిహేను రోజులుగా వర్షాలు పడకపోవడంతో చేతికొచ్చిన పత్తి ఎండి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బజార్హత్నూర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు సాగు నీటిని విడు దల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయా యి. విషయం తెలసుకున్న ఇరిగేషన్ ఏఈ తిరుపతి ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి వెంటనే కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. ఈ ఆందోళనలో పాక్స్ చైర్మన్ మేకల వెంకన్న, రైతులు ఉప్పు సాయి, చట్ల మధూకర్, కొడిమేల చిన్నయ్య పాల్గొన్నారు.