Compressor Blast : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. నవంబర్ 11 ఆదివారం తెల్లవారుజామున చెక్‌పోస్టు సమీపంలోని తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్(Telangana Spicy Kitchen Restaurant)లో రిఫ్రిజిరేట్లోని కంప్రెసర్ ఒక్కసారిగా పేలింది. దీంతో పెద్ద శబ్దంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి.
పేలుడు ధాటికి రెస్టారెంట్ పక్కనే ఉన్న బస్తీవాసులు ఉలిక్కి పడ్డారు. భయంతో ఇండ్లలోంచి బయటకు పరుగులు పెట్టారు. ఈ ప్రమాదం కారణంగా బస్తీలోని పలు ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ హానీ జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పేలుడు సమాచారం అందుకున్న జూహ్లిహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణం ఏంటి? అసలు కంప్రెసర్ ఎందుకు పేలింది? వంటి విషయాలను ఆరా తీస్తున్నారు. పేలుడు కారణంగా దెబ్బతిన్న బస్తీ ఇండ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కంప్రెసర్ పేలుడు ఈ ఘటనపై తెలంగాణ స్పైసీ కిచెన్ రెస్టారెంట్ నిర్వాహకులను విచారిస్తున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.