Ministry of Sex | జననాల రేటు పెంచేందుకు.. శృంగార మంత్రిత్వ శాఖ!
మీరు చదివింది నిజమే! శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోవడం, మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సంభవిస్తున్న ప్రాణనష్టంతో ఆందోళన మొదలైంది.
Ministry of Sex | న్యూఢిల్లీ: మీరు చదివింది నిజమే! శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోవడం, మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సంభవిస్తున్న ప్రాణనష్టంతో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం జననాల రేటు పెంచేందుకు రెడీ అవుతున్నది. అందులో భాగంగా శృంగారం కోసం ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇక, జననాల రేటు పెంచడంలో భాగంగా రాత్రివేళ ఇంటర్నెట్ పూర్తిగా ఆఫ్ చేయడం, కరెంటు తీసేయడం వంటి పలు ఆలోచనలు చేస్తున్నది. దీనివల్ల జంటల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, అది జననాల రేటు పెరిగేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నది. 1999 తర్వాత తొలిసారి ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జననాల రేటు దారుణంగా పడిపోయింది.
ఈ ‘విపత్తు’ నుంచి గట్టెక్కేందుకు ‘మినిస్ట్రీ ఆఫ్ సెక్స్’ (శృంగార మంత్రిత్వశాఖ)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అలాగే ఇంటర్నెట్ సేవలను రాత్రివేళ నిలిపివేయడంతోపాటు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని భావిస్తున్నది. జననాల రేటు పెంచేందుకు ఇలాంటి పలు ఐడియాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
ఇంట్లో ఉండే తల్లలుకు ‘వేతనం’ ఇవ్వడం, వివాహం తర్వాత హోటళ్లలో బస చేసే జంటకు అయ్యే ఖర్చును భరించడం, డేటింగ్ను ప్రోత్సహించడం వంటి పలు ఆలోచనలను పరిశీలిస్తున్నది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రష్యాలో 5,99,600 జననాలు మాత్రమే నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 16 వేల జననాలు తక్కువగా నమోదయ్యాయి. జననాల రేటు ఇంత దారుణంగా పడిపోవడం 1999తో పోలిస్తే ఇదే తొలిసారి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

