హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వే పూర్తి శాస్త్రీయంగా జరిగిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. సర్వేలో ప్రజలు పాల్గొనేలా అవగాహన కల్పించాలని కుల సంఘాలను కోరామని, అయినా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తప్పుడు లెక్కలు అంటూ హడావుడి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వేను మంగళవారం క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరుపుతామని తెలిపారు. ఈ చర్చకు ప్రతిపక్ష, పాలక సభ్యులు సహకరించాలని విజ్ఞప్తిచేశారు.