హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుతో ఆరోగ్యంపై దుష్ప్రభావంతోపాటు పర్యావరణానికి పెనుముప్పు కలుగుతుందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో గురువారం ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుపై రైతు సంక్షేమ కమిషన్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు రైతులు ఇథనాల్ పరిశ్రమల స్థాపనను వ్యతిరేకరిస్తూ చైర్మన్ కోదండరెడ్డికి ఫిర్యాదు చేశారు. కోదండరెడ్డి మా ట్లాడుతూ త్వరలో మహబూబ్నగర్, నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇథనాల్ పరిశ్రమలతోపాటు ప్రతిపాదిత ప్రాంతాలకు వెళ్లి రైతులతో మాట్లాడతామని పేర్కొన్నారు. రైతుల అభిష్టానుసారమే ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు.