ఆబిడ్స్, నవంబర్ 17: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎక్స్ అకౌంట్లో తప్పుడు పోస్ట్‌లు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిపై గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు ఆశిష్‌కుమార్ యాదవ్ హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆశిష్‌కుమార్ మాట్లాడుతూ కేటీఆర్‌ను సూటిగా ఎదుర్కొనే దమ్ములేక కక్ష కట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో గోషామహల్ నియోజకవర్గం గన్‌ఫౌండ్రి అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, జాంబాగ్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శైలేష్, ప్రదీప్‌రాజ్, అనిల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.