మణికొండ, మే18 : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కుటుంబసభ్యుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీసేలా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ మహాన్యూస్ చానల్ ప్రతినిధి వంశీకృష్ణపై సోమవారం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆర్ఎస్పీ కుటుంబసభ్యులను అవమానించేలా, వారి గౌరవాన్ని దెబ్బతీసేలా మీడియా స్వేచ్ఛ పేరిట కథనాలు ప్రసారం చేస్తున్నారని ఉదయ్‌కుమార్ ఈ ఫిర్యాదు చేశారు.
నిరాధార ఆరోపణలు, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వంశీకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వెంటనే ఆ ప్రసారాలను నిలిపివేయించాలని పేర్కొన్నారు. ఈ విషయమై ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్టు నార్సింగి పోలీసులు తెలిపారు.