KTR | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదురోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్‌లో ఉంటే సర్కార్ కోల్డ్ స్టోరేజ్‌లో పడుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎల్ నినోతో వర్షాభావ పరిస్థితులు వస్తాయని శాస్త్రవేత్తలు ఆరు నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పుడు మీటింగులు పెట్టి ప్రయోజనం ఏమిటని, రైతులు ఇప్పటికే నష్టపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వానికి ప్రణాళిక, దిశ లేవని, వ్యవసాయంపై అవగాహన లేదని విమర్శించారు.
గాచారం బాగాలేకనే పోచారం మునిగే కాంగ్రెస్ పడవ ఎకారని, జీవితాంతం కేసీఆర్‌తోనే ఉంటానని వేంకటేశ్వరస్వామి మీద ఒట్టేసి మాటతప్పారని, ఇప్పుడా శాపం తగలకమానదని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ 2,000 మంది తన అనుచరులతో తెలంగాణభవన్‌లో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేశారని విమర్శించారు.
బాన్సువాడ ప్రజలు ఒకప్పుడు గులాబీ జెండాను ఎగురవేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని విశ్వసించి గెలిపించారని, ఆయన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. ‘సింపుల్‌గా చెప్పాలంటే గాచారం బాగాలేకనే పోచారం వేరే దానికి పోయిండు. ఎవరైనా తెలిసితెలిసి మునిగే పడవ ఎకుతారా? కాంగ్రెస్ అనేది అసలు ఉండే పార్టీయా? భవిష్యత్తు ఉన్న పార్టీయా? నాది కాంగ్రెస్‌లోనే పుట్టుక అని పెద్దపెద్ద డైలాగులు కొట్టి అందులో చేరిండు. ఇప్పుడు మింగలేక కకలేక, కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకునే పరిస్థితికి చేరుకున్నడు. ఈ వయసులో ఆ పెద్ద మనిషికి ఇంతకంటే అవస్థ అవసరమా?’ అని ప్రశ్నించారు. నిన్నమొన్నటి వరకు శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఇవాళ తాను ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఓడించడమే బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతాడో, ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎకడ ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి. మన ఖర్మ బాగాలేక ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఇకడ డబ్బులు దోచుకోవడం, మూటలు కట్టడం, నెలకోసారి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీకి అప్పగించడం, రెన్యూవల్ టప్పా వేయించుకొని రావడం తప్ప ఆయనకు ఇంకేం తెలియదు’ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండేండ్ల్లకుపైగా కాంగ్రెస్ పాలనలో రాష్ర్టానికి చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు.
‘తెల్లారితే కేసీఆర్‌ను తిట్టడం, దేవుండ్ల మీద ఒట్లు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో పని లేదు. రెండున్నరేండ్లలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా కొరత, విద్యుత్తు సమస్యలు, ధాన్యం కొనుగోలు ఇబ్బందులు, సాగునీటి కొరత వంటి సమస్యలు పరిషరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు సకాలంలో అందేదని, యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు.
‘నిజాంసాగర్ సామర్థ్యం 17 టీఎంసీలు. కేవలం రెండు రోజులు మోటర్లు నడిపితే ప్రాజెక్టు నిండిపోతుంది. కానీ, ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదు. రైతులంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు’ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయని, కానీ మొత్తం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించడం సరికాదని హితవుపలికారు. ‘31 నెలలు గడిచినా రెండు పిల్లర్లను బాగు చేయలేరా? మేస్త్రీలు దొరకలేదా? సిమెంట్ దొరకలేదా? ప్రభుత్వం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం పేరుతో అబద్ధాలు చెప్తున్నది’ అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వృద్ధులకు రూ.4,000 పెన్షన్, యువతకు ఉద్యోగాలు వంటి హామీలు అమలుకాలేదని కేటీఆర్ విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ వంటి ప్రముఖులు బీఆర్ఎస్లో చేరడం బాన్సువాడలో పార్టీ మరింత బలోపేతం అవుతున్నదనడానికి నిదర్శనమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బాన్సువాడతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పిలుపునిచ్చారు. బాన్సువాడలో మళ్లీ గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు హనుమంత్ షిండే, జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు వీజీగౌడ్, తోట ఆగయ్య, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నాయకులు అంజిరెడ్డి, సుమిత్రా ఆనంద్, రత్నకుమార్, బాజిరెడ్డి జగన్, జుబేర్, ఎలమంచిలి శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, నవీన్, రవి, రాంబాబు, ఖలీల్, ఫిరోజ్, మక్బుల్, ధర్మతేజ, మాధవరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన బాన్సువాడ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ సందర్భంగా దేవుడి మీద ఒట్టేసి ‘నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు మీతోనే ఉంటా’ అని చెప్పిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు.
‘దేవుడి మీద రేవంత్‌రెడ్డి ఒకడే ఒట్లు పెట్టి మోసం చేస్తాడనుకున్నం. కానీ పోచారం కూడా మోసం చేసిండ్రు. ఆయనను ఇవాళ దేవుడు కూడా కాపాడలేడు. తెలంగాణ తిరుమల వెంకన్నస్వామి శాపం ఆయనకు తప్పకుండా తగులుతుంది. బాన్సువాడలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా మేము మీతోనే ఉంటం’ అని భరోసా ఇచ్చారు.
బాన్సువాడ, నిజామాబాద్ జిల్లా రైతులకు నీరందించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీటిని వృథాగా సముద్రంలోకి వదులుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘ఇకడ నీళ్లు లేవంటరు. కానీ, అదే నీళ్లు కిందకు వెళ్తున్నయి. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మోటర్లు నడుస్తున్నయి. వరంగల్‌లో దేవాదుల, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులు నడుస్తున్నయి. అకడ నీళ్లు ఉంటే ఇకడ ఎందుకు లేవు?’ అని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు విడుదల చేయాలని కోరితే రక్తం గురించి వ్యాఖ్యలు చేశారని, అందుకు నిరసనగా మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి రక్తదానం చేసి ఎస్సారెస్పీకి నీళ్లు విడుదల చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ‘తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇస్తాం. రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధం. కానీ రైతులను ఎండబెట్టే ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటం’ అని స్పష్టంచేశారు.
‘రేవంత్‌రెడ్డి విఫల పాలన, బూతల తీరు చూస్తుంటే వెంటనే ఎన్నికలు వస్తే బాగుండు.. కాంగ్రెస్‌ను ఓడించి మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చూడాలి’ అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దారుణంగా బూతులు మాట్లాడరని, మూటలు అందుతున్నాయి కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఆయనను భరిస్తున్నదని విమర్శించారు. అందరూ కరువుతో బాధపడుతున్నారని, ఎవ్వరివద్దా డబ్బుల్లేవని, కానీ, ధనం మీద కూర్చున్న ఒకే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని తీవ్ర విమర్శలు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించడం ఖాయమని, తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన కేసీఆర్‌కు ద్రోహం చేసిన వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలతోపాటు అధికార పార్టీ చేయించిన సర్వేల్లో కూడా బాన్సువాడలో బీఆర్ఎస్ విజయమే ఖాయమని తేలిందని వెల్లడించారు.
బాన్సువాడ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీని వీడినా, ప్రతి గ్రామం, ప్రతి ఇంట్లో కేసీఆర్‌ను అభిమానించే కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. బాన్సువాడలో జరిగిన ప్రతి అభివృద్ధి పనికి కేసీఆరే కారణమని, ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ ఫలాలు అందాయని గుర్తుచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని గౌరవించి అన్ని విధాలుగా ఆదరించినా, చివరికి ఆయన కేసీఆర్‌ను మోసం చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. కేసీఆర్‌కు ద్రోహం చేసిన వ్యక్తిని తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని బాన్సువాడ కార్యకర్తలు కోరుతున్నారని, వారి అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో ఎకడ ఏ సమస్య వచ్చినా, ఏ కార్యకర్తకు ఇబ్బంది ఎదురైనా కేటీఆర్, హరీశ్‌రావు ముందుండి పోరాడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం, నల్లగొండ నుంచి మహబూబ్‌నగర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు నిజమైన శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీయేనని, కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు మళ్లీ సుభిక్షమైన పాలన వస్తుందని తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ సైనికులుగా తాము పనిచేస్తామని పార్టీలో చేరిన మోరిల్ శ్రీనివాస్‌రావు స్పష్టంచేశారు.
ఇకడ నీళ్లు లేవంటరు. కానీ, అవే నీళ్లు కిందికి పోతున్నయ్. ఆ నీళ్లనే ఏపీలో మోటర్లు ఎత్తిపోస్తున్న య్. వరంగల్‌లో దేవాదుల, ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులు నడుస్తున్నయ్. అకడ నీళ్లుంటే ఇకడ ఎందుకు లేవు? రైతులకు నీళ్లు ఇవ్వుమంటే రక్తం గురించి మాట్లాడుతున్నరు. తెలంగాణ కోసం ప్రాణాలైనా ఇస్తం. రైతుల కోసం రక్తం ఇవ్వడానికైనా సిద్ధం. కానీ సాగును ఎండబెట్టే సర్కార్‌ను మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటం.
– కేటీఆర్