న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సభ్యుడిగా ఎన్నికైన జీ కిరణ్‌కుమార్ ఆదివారం న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బీసీఐ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా, పలువురు సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి పదవీకాలం ముగించుకున్న బీసీఐ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు కిరణ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన కిరణ్ కుమార్ 25 ఏండ్ల నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన గతంలో నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ (ఎంసీసీబీఏ) ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీఐ సభ్యుడిగా తెలంగాణ న్యాయవాదుల సమస్యలను జాతీయస్థాయిలో ప్రస్తావించడంతోపాటు న్యాయవాదుల సంక్షేమం, హకుల పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తానని కిరణ్ కుమార్ తెలిపారు.