హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మానవ వైద్య పరిశోధన, వైద్య పరిశోధనలు చేపడుతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు మంగళవారం ప్రకటనలో తెలిపా రు. దీపాంకర్ డే అనే దినసరి కూలీపై చేసిన వైద్యం వికటించడంతో అతడు దవాఖాన పాలుకాగా, కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయగా, కేసు నమో దు చేసినట్టు తెలిపారు. బాలానగర్ కేంద్రంగా ఈ మెడికల్ టెస్టింగ్ మాఫియా అమాయకులకు డబ్బులు ఆశచూపి ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు.