మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్, జనవరి 21 : బీఆర్ఎస్ శ్రేణులే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు దాడులకు తెగబడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్లే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సొంతూరులో ఓడిపోయాడని కక్షగట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను బలవంతంగా కిడ్నాప్ చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో సంచలనం రేపింది. భూత్పూర్ మండలం మద్దిగట్లలో ఇటీవల జరిగిన సర్పం చ్ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుదారుడు ఓటమిపాలయ్యాడు. మద్దిగట్లకు చెందిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించి ఓ ఎస్సై గల్లా పట్టుకొని నానా రభస సృష్టించా డు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈ పోస్టుపై బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్‌గౌడ్ కామెంట్ పెట్టాడు.
దీనిని మనసులో పెట్టుకున్న శ్రీనివాస్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షు డు భూపతిరెడ్డి కలిసి మంగళవారం సాయం త్రం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న వెంకటేశ్‌గౌడ్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకొని రైతు వేదిక వద్దకు తీసుకువెళ్లి దాడి చేశా రు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా వినకుండా.. ‘నిన్ను కొట్టడం కాదు.. చంపేస్తాం రా.. బీఆర్ఎస్కు మద్దతు ఇస్తావా?’ అని బెదిరించారు. తమపైనే సోషల్ మీడియాలో పోస్టు లు పెడతావా? అంటూ విచక్షణా రహితంగా దాడి చేశారు. ‘ఎస్సై గల్లా పడితేనే నన్ను ఎవ రూ ఏం పీకలేదు.. నువ్వో లెక్కనా?’ అంటూ తీవ్రంగా కొట్టారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న వెంకటేశ్‌గౌడ్.. భూత్పూర్ పీఎస్‌కు చేరుకొని ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై తీసుకోకుండా వెనక్కి పంపాడు. దీంతో వెంకటేశ్‌గౌడ్ బంధువుల ఇంట్లో తలదాచుకొని ఉదయం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి చెప్పుకొన్నాడు. ఒంటిపై ఉన్న
హుటాహుటిన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో బాధితులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ రత్నంకు ఫిర్యాదు అందించారు. అడిషనల్ ఎస్పీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ భూత్పూరు మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపతిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉన్నదని, శ్రీనివాస్‌రెడ్డి, భూపతిరెడ్డి తనను చంపేస్తామని బెదిరించారని వెంకటేశ్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశాడు.
సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలిచినందుకు కక్ష కట్టి బీఆర్ఎస్ కార్యకర్త వెంకటేశ్‌గౌడ్‌పై అధికార పార్టీ నాయకులు దాడికి దిగడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ అరాచకాలు పెరిగిపోతున్నాయని, పోలీసులు అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కేసులను పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డా రు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించి కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు చేయాలని, వారి ఆగడాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.