హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని.. కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకుంటామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటిప్రాజెక్టులపై సహచర మంత్రి వాకటి శ్రీహరితో కలిసి సంబంధిత జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ప్రాజెక్టులవారీగా పనుల పురోగతిని, క్షేత్రస్థాయిలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పూర్తికి రూ.5వేల కోట్లు అవసరమని, జూన్ 2లోగా భూసేకరణ పూర్తి చేస్తామని, 2028 డిసెంబర్‌లోగా అన్ని ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. నిధులను గ్రీన్ చానల్లో విడుదల చేస్తామని తెలిపారు.