కవాడిగూడ, జూన్ 3: ఎస్సీ గురుకుల విద్యార్థులపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణిపై హై దరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఎస్సీఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
విద్యార్థులను సమానంగా చూడాల్సిన అధికారి ఇలా వ్యాఖ్యానించడం బాధాకరమని అన్నారు.