మహబూబ్నగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మహబూబ్నగర్లో కోట్ల విలువచేసే భూమిపై కన్నేసిన ఓ కాంగ్రెస్ నేత హైదరాబాద్లో ఉంటున్న బాధితులను బెదిరిస్తున్నాడు. సీఎం సోదరుల పేరు చెప్పి బలవంతంగా 3 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని హైదరాబాద్కు చెందిన కళావతి, రాంబాబు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. అలాగే డీజీపీ ఆఫీస్కు వెళ్లి ఐజీని కలిశారు.
ఆ తర్వాత మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించి తమను భయబ్రాంతులకు గురిచేస్తున్న విషయాన్ని వివరించారు. దీంతో స్పందించిన మానవ హక్కుల కమిషన్ బుధవారం బాధితులను విచారించనున్నది. రూరల్ పోలీస్స్టేషన్లో తమపై ఉన్నకేసు విషయమై సంతకం పెట్టడానికి వెళ్లి తిరిగి వస్తుండగా రాఘవేందర్రాజు, అతని అనుచరులు భయబ్రాంతులకు గురిచేసి మూడెకరాలు రాయించుకున్నారని ఐజీకి ఫిర్యాదు చేశారు.