సూర్యాపేట : సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy )రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రతిపక్ష నేతలను అసభ్య పదజాలంతో దూషిండం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో(Suryapet Police Station) ఫిర్యాదు చేశారు.
సీఎం రేవంత్, మంత్రి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి జరిగిందన్నాఉ. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు గౌడ్, కౌన్సిలర్లు తాహెర్ పాషా, మడిపెళ్లి విక్రమ్, నాయకులు ఆకుల లవకుశ, బత్తుల జానీ యాదవ్, గండూరి కృపాకర్, బత్తుల రమేష్, అబ్దుల్ రహీం (పిల్లు), దేశగాని శ్రీను, తదితరులు పాల్గొన్నారు.