మిరుదొడ్డి/సిద్దిపేట : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ను అవమాన పర్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు మండల అధ్యక్షుడు దార స్వామి అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఆనుకొని బీజేపీ ప్లెక్సీలు కట్టించి కించపర్చారని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని గురువారం మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో మాలమహానాడు ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడైనా సరే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే రఘునందన్ రావు క్షమాణ చెప్పాలని డిమాండు చేశారు. లేదంటే నియోజకవర్గంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాల మహానాడు మండల ప్రధాన కార్యదర్శి మండల యాదగిరి, నేతలు నితిన్, చంద్రం, రాజయ్య, సాయికుమార్, అశోక్, ఎల్లం, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.