Koheda Market | కొహెడ మార్కెట్లో భూములు కోల్పోతున్న దళిత కుటుంబాలకు నష్టపరిహరం అందించాలి
Koheda Market | కొహెడ మార్కెట్లో భూములు కోల్పోతున్న దళిత కుటుంబాలకు నష్టపరిహరం అందించాలని కోరుతూ దళిత రైతులు సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబుకు వినతి పత్రం అందజేశారు
తుర్కయంజాల్ : కొహెడ మార్కెట్ ( Koheda market ) లో భూములు కోల్పోతున్న దళిత కుటుంబాలకు నష్టపరిహరం అందించాలని కోరుతూ దళిత రైతులు ( Dalit families) సోమవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిభట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడ రెవెన్యూ సర్వే నంబర్ 167/1లో తరతరాలుగా దళిత కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వివరించారు.
ఈ భూమిని మార్కెట్ పేరుతో ఎలాంటి నష్టపరిహరం చెల్లించకుండా లాక్కోవడమే కాకుండా ఎస్సీల హక్కులను కాలరాస్తూ అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహరం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ దళిత రైతులకు చెందిన భూములను దౌర్జన్యంగా లాక్కోంటున్నారని ఆరోపించారు.
నష్టపరిమరం చెల్లించాలని కోరిన రైతులతో పాటుగా మద్దతుగా నిలిచిన స్థానిక నాయకులపై కేసులు నమోదు చేయిస్తుందని అన్నారు. రైతులకు నష్టపరిహరం చెల్లించడంతో పాటుగా ఎకరాకు 600 గజాల స్థలం కేటాయించాలని ఎస్సీ కమిషన్ను కోరారు. కార్యక్రమంలో కొహెడ జేఏసీ సభ్యులు కందాళ బలదేవరెడ్డి,రాంరెడ్డి, కొహెడ రైతులు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

