హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారత్‌లో మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల ఏశారు.
దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.