హైదరాబాద్, సెప్టెంబర్ 11 ( నమస్తే తెలంగాణ) : బెంగళూరులో జరుగుతున్న మూడురోజుల 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి గురువారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు, అధికారుల బృందం వెళ్లింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) చట్టం-2025 ద్వారా సంగారెడ్డి జిల్లాలో ఆరు గ్రామ పంచాయతీలు (ఇంద్రేశం, బచుగూడెం, రామేశ్వరంబండ, చిన్నకంజర్ల, ఇందోల్, పెద్దకంజర్ల) 18వార్డులు కలిపి ఇంద్రేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. అలాగే, పది గ్రామ పంచాయతీలు (జిన్నారం, కొడకంచి, ఊట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకత్వ, అమ్దూర్, జంగంపేట్, మంగంపేట్) 20వార్డులు కలిపి జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. నిరుడు ఇంద్రేశం, జిన్నారం పంచాయతీ పరిధిలో ఉన్న రుద్రారం, లక్డారం గ్రామాలను కలిపి ఇస్నాపూర్ మున్సిపాలిటీని విస్తరించారు.