చట్టసభల్లో జరిగే చర్చలపై ప్రజల్లో గౌరవభావం తగ్గుతున్నదని, శాసనసభలు నిజమైన చర్చా వేదికలుగా కొనసాగినప్పుడే ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
బెంగళూరులో జరుగుతున్న మూడురోజుల 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి గురువారం తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్త