ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని ఈటల రాజేందర్ పదేపదే చెప్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని ఈటల రాజేందర్ పదేపదే చెప్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా భూకబ్జా ఆరోపణలు ఎదుర్కోవడంతో.. మంత్రివర్గం నుంచి ఈటలను కేసీఆర్ తొలగించారు. సంక్షేమ పథకాల గురించి కానీ, బీసీలు, ఎస్సీల గురించి మాట్లాడితేనో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించలేదు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఆస్తులను కాపాడుకునేందుకు మాత్రమే రాజీనామా చేసిండు. తనది మావోయిస్టు భావజాలం అని చెప్పుకునే ఈటల.. దానికి పూర్తిగా వ్యతిరేకమైన బీజేపీలో చేరిండు.
బీజేపీలో చేరిన ఆయన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాజీనామా చేయమని కేసీఆర్ చెప్పనే లేదు. ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండేది. గెలిస్తే నియోజకవర్గానికి ఏం చేస్తాడో చెప్పడం లేదు. ఐదేండ్లు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల హయాంలోనే రైతు బంధు పథకం ప్రవేశపెట్టిండు. ఇప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టగానే.. ఆ పథకం సాధ్యం కాదు అని ఈటల అంటున్నారు. యాదవబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను తప్పకుండా గెలిపించుకుంటాం. గెల్లు శీనన్న చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి. ఈటల ఏ రోజు కూడా బీసీలకు, ఎస్సీలకు సాయం చేసింది లేదు. ఈటల కంటే గెల్లు శీను తెలివిమంతుడు.
– సాయిళ్ల రాజు ( హుజూరాబాద్ )