హైదరాబాద్, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ తరపున మార్క్ఫెడ్ కొనుగోలు చేసే పంటలకు సంబంధించి పర్యవేక్షణకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వ్య వసాయ శాఖ డైరెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్, మార్క్ఫెడ్ ఎండీ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీ, అగ్రికల్చర్ ఏడీ, నాఫెడ్ రాష్ట్ర ఉన్నతాధికారి, సీడబ్ల్యూసీ ఆర్ఎం సభ్యులుగా ఉండనున్నారు.
ఏఎంవీఐ ఫలితాలు విడుదల
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రవాణాశాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 113 పోస్టులకు సంబంధించిన సెలెక్షన్ జాబితాను వెబ్సైట్లో పెట్టింది. 2022 డిసెంబర్లో ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, రాత పరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తిచేసిన కమిషన్ గురువారం ఫలితాలను ప్రకటించింది.