హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): దాశరథి కృష్ణమాచార్య అ వార్డు-2024కోసం సాహితీవేత్తను ఎం పిక చేసేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కవి డాక్టర్ ఎన్ గోపి అధ్యక్షతన సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మెంబర్ కన్వీనర్‌గా, విశ్రాంత ప్రొఫెసర్ కేతవరపు కాత్యాయని, కవి జయరాజు, అదనపు కలెక్టర్ ఏనుగు న ర్సింహారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ డాక్టర్ సీతారామ్ సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ సాహితీ రంగంలో విశిష్ట సేవలందించిన కవులు, సాహితీవేత్తల్లో ఒకరిని ఎంపికచేసి వారి పేరును ప్రభుత్వానికి నామినేట్ చేస్తుంది. ఎంపికైన వారికి ఈ నెల 22న దాశరథి కృష్ణమా7/18/2024 9:04:35 PMచార్య జయంతి సందర్భంగా జ్ఞాపికతోపాటు రూ. 1,01,116 నగదు బహూకరిస్తారు.