తెలంగాణ చౌక్, మే 30: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యా దవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని తారక హోటల్లో నిర్వహించిన సమావేశంలో రాజారాం యాదవ్ మాట్లాడుతూ… కామారెడ్డి ఎన్నికల సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమల్లోకి వస్తే దాదాపు 23 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులయ్యే అవకాశం ఉన్నదని తెలిపారు.
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ జూన్ 8న మహాధర్నా,15న సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలన్నారు.