Rahul Gandhi | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి పెండ్లయిందా? లేదా?.. పెళ్లయ్యిందంటూ బ్లిట్జ్ పత్రికలో ప్రచురితమైన కథనంపై వివరణ ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయానికి వెళ్లి, అక్కడి సిబ్బందికి బ్లిట్జ్ పత్రిక ను అందజేశారు. ఆయన స్వయంగా పత్రికను చదివి, అందులో వచ్చిన కథనంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. భారతదేశ వ్యవహారాలకు సంబంధించి విదేశీ మీడియా సంస్థ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక సరైనదేనని రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ వాదిస్తున్నపుడు, బ్లిట్జ్ కథనం కూడా సరైనదేనా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తల్లి స్వార్జిత ఆస్తిపై పిల్లలకు హకులు ఉండవని, స్వార్జిత ఆస్తిని తనకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చే అధికారం తల్లికి ఉంటుందని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుశీల్ అగర్వాల్ అనే మహిళకు భర్త నుంచి సంక్రమించిన ఇంటిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచకుండా పెద్దకుమారుడి పేరుతో గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ చేయడాన్ని సివిల్ కోర్టు సమర్ధించింది. దీన్ని సవాల్ చేస్తూ భజరంగ్‌లాల్ అగర్వాల్ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని ధర్మాసనం కొట్టివేసింది. ఆ ఆస్తిని ఉమ్మడి కుటుంబ ఆస్తిగా ప్రకటించాలన్న వాదన చట్ట వ్యతిరేకమని తేల్చింది. ఆ ఆస్తి యజమానిగా తల్లికే పూర్తి హకులు ఉంటాయని తీర్పు చెప్పింది.