హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): జిల్లా కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ పథకం అమలుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజ రు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసిం ది. 2004లో మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ పాలనాపరమైన జాప్యం కారణంగా కొందరు 2005 లో ఉద్యోగాల్లో చేరారు. తాము పాత పిం ఛన్ పొందే అవకాశం కోల్పోయామంటూ ఉద్యోగులు హైకోర్టుకు వచ్చారు.
ఉద్యోగంలో చేర్చుకోకపోవడం ప్రభుత్వ జాప్యమని, ఒకే నోటిఫికేషన్లో కొందరు ముందుగా చేరడం వల్ల పాత పెన్షన్, పాలనాపరమైన ఆలస్యం వల్ల తర్వాత చేరిన వారికి కొత్త పెన్షన్ విధానం అమలు చేయ డం సరికాదని గతంలో హైకోర్టు చెప్పింది.
కోర్టుకు వచ్చిన ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి వారి అభ్యర్ధన మేరకు పెన్షన్ పథకాన్ని వర్తింపజేయాలని ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ దాఖలైన కోర్టు ధికరణ పిటిషన్లను జస్టిస్ పి శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.