హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): వృత్తివిద్యాకాలేజీల్లో అడ్మిషన్లపై సమగ్ర సమాచారంతో ప్రముఖ విద్యావేత్త, రచయిత ఎన్ సుధీర్‌రెడ్డి రచించిన ‘కాలేజ్ అడ్మిషన్స్ డీకోడెడ్’ పుస్తకాన్ని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మంగళవారం శ్రీనగర్‌కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఆవిషరించారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని రచించిన సుధీర్‌రెడ్డిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఈ పుస్తకం అందరికీ ఒక దిక్సూచి అవుతుందని, మార్గదర్శనం చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు వేమిరెడ్డి నరసింహారెడ్డి, ఎన్ చెన్నారెడ్డి, మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.