 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30(నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్‌తో నవంబర్ 4న చలో కలెక్టరేట్ కార్యక్రమానికి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రభుత్వం ఎంతోకాలంగా నిధులు విడుదల చేయకుండా, ఇప్పుడేమో నిధుల్లో కోతలు విధించేందుకు యత్నిస్తున్నట్టు ఆరోపించారు. బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల్లో కోతలు పెట్టడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మూసీ సుందరీకరణపై ఉన్న శ్రద్ధ, పేద విద్యార్థుల భవిష్యత్తుపై లేదని ధ్వజమెత్తారు.
 
                            