రాజన్న సిరిసిల్ల : వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటనపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం విద్యార్థిని నిహారిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హాస్టల్ బయటే నిలబెట్టి నిహారిక అనారోగ్యానికి కారణమైన కళాశాల కామర్స్ లెక్చరర్ డీ మహేశ్వరిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న మాతంగి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు.