Cold Weather | హైదరాబాద్, జనవరి 21 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో ఐదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జనవరిలో చలి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 6, సం గారెడ్డి జిల్లా కోహిర్లో7, మొహినాబాద్‌లో 7.6, ఆదిలాబాద్ జిల్లా బేలలో 7.8, నిర్మల్ జిల్లా పెంబిలో 8.6, వికారాబాద్ జిల్లా మార్పల్లిలో 8.6, కా మారెడ్డి జిల్లా జుక్కల్‌లో 8.8, సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేటలో 9.1, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లామేడ్చల్‌లో 9.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): టీజీ ట్రాన్స్‌కోకు 2000 కోట్లు మంజూరుచేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. డిస్కమ్‌ల నిర్వహణకు ఈ మొత్తం కేటాయించింది.