హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలిగాలుల విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలి తీవ్రంగా వణికిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలోపు నమోదవుతున్నాయి. 10 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి.
సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-యూలో 8 డిగ్రీలు నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 24 నాటికి వాయుగుండంగా మరే అవకాశమున్నదని అధికారులు వెల్లడించారు.