వికారాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): స్పీకర్ ప్రసాద్‌కుమార్-చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. స్పీకర్‌కు తెలియకుండా యాదయ్య వికారాబాద్ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంతర్గత కుమ్ములాటకు దారి తీసింది. స్పీకర్ షిర్డీ వెళ్లిన సమయంలో వికారాబాద్ సెగ్మెంట్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను యాదయ్య సీఎం వద్దకు తీసుకెళ్లడంపై ప్రసాద్‌కుమార్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యను నియోజకవర్గమంతటా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వ్యతిరేకించడం, దాడులకు తెగబడుతుండటంతో ఆయన చేవెళ్ల కంటే వికారాబాద్ సెగ్మెంట్‌కే అధికంగా ప్రాధాన్యమిస్తున్నట్టు సమాచారం. ఆ విధంగా వికారాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను రెండుమార్లు యాదయ్య సీఎం వద్దకు నడిపించినట్టు తెలిసింది.
తాము కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు యాదయ్య చెప్తున్నప్పటికీ ఆయన తన సొంత నియోజకవర్గం నేతలను కాకుండా స్పీకర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన నాయకులకు సన్నిహితంగా కావడంపైనే రచ్చ మొదలైంది. తన నియోజకవర్గంలో కాలె యాదయ్య చేస్తున్న రాజకీయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి స్పీకర్ ప్రసాద్‌కుమార్ త్వరలోనే తీసుకెళ్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.