Weather Update | హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తకువగా, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో కనిష్టంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. హైదరాబాద్లో 11.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత అధికంగా ఉన్న 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 17 జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారడంతో ఏపీలో 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని స్పష్టంచేశారు.