కవాడిగూడ, జూన్ 14: దేశ విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరమని ప్ర ముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనంవాంగ్చుక్ అభిప్రాయపడ్డారు. కేంద్ర వి ద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనా మా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ ప్రతినిధి విజేతదహియా, ప్రొఫెసర్ కే నాగేశ్వర్‌తో క లిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనంవాంగ్చుక్ మాట్లాడుతూ ద్వేషరహిత, భయరహిత సమాజం ద్వారానే దే శం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని పే ర్కొన్నారు. దేశంలో జవాబుదారీతనం కో సం కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్ద తు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రొఫెసర్ కే నాగేశ్వర్ మాట్లాడుతూ పేపర్లీక్లకు బాధ్యత వహి స్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చమురు ధర లు పెరుగుతున్నాయంటే ఏడాది వరకు బంగారం కొనొద్దు అని ప్రధాని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని విమర్శించారు.
ఆన్లైన్లో ప్రారంభమైన ఈ ఆవేశం స్ట్రీట్ఫైల్ పోరాటంగా సాగాలని పిలుపునిచ్చా రు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి విజేత ద హియా మాట్లాడుతూ విద్యార్థులు, యువ త ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత ప రిష్కారం అవసరమని పేర్కొన్నారు. సోష ల్ మీడియా ద్వారా దేశ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు. వ్యవస్థతో పాటు ప్రకృతిని కాపాడుకోకుంటే మ నుగడే ప్రశ్నార్థకమవుతుందని గుర్తుచేశారు. వ్యవస్థ పునర్నిర్మాణం అయ్యే వరకు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను విరమించేది లేదని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఆకునూరి మురళి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎంవీ వెంకట్‌రెడ్డి, తెలంగాణ విఠల్, జర్నలిస్టులు తులసీచంద్, రావణ్, విజయ్ మల్లంగి, రుచిత్ కమల్, అశోక్, అన్సార్, ప్రత్యూష, తదితరులు పాల్గొన్నారు.
లీక్‌లతో భవిష్యత్తు అంధకారం
దేశ విద్యావ్యవస్థ నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నదని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి అభిప్రాయపడింది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్లోని ధర్నాచౌక్‌లో ని ర్వహించిన భారీ బహిరంగ సభకు ఏఐవైఎఫ్ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భం గా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క ల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. 2024లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ వివాదం, యూజీసీ-నెట్ పరీక్ష ర ద్దు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై వ చ్చిన ఆరోపణలు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యా న్ని బట్టబయలు చేశాయని ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, సహాయ కార్యదర్శి యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు శివకుమార్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాన్ని లెక్కచేయకుండా..
బెంగళూరు: నీట్ యూజీ పరీక్షలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆదివారం ని రసన చేపట్టింది. ఫ్రీడం పార్క్‌లో జరిగిన ఈ ప్రదర్శనలో భారీ వర్షాన్ని లెక్కచేయకుండా యువకులు పాల్గొన్నారు. నిరసనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలకు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వ హిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చే శారు. నటుడు ప్రకాష్ రాజ్ ఈ ఉద్యమం లో పాల్గొని, తన మద్దతు ప్రకటించారు. పలు యువజన సంఘాలు, సంస్థలు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాయి.