హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): విద్యారంగంలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తమకు హామీనిచ్చినట్టు పీఆర్టీయూ టీఎస్ నేతలు తెలిపారు. సంఘం నేతలు మంగళవారం సచివాలయంలో సీఎంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంఘం క్యాలెండర్‌ను రేవంత్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు రవీందర్, మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి ఉన్నారు.