Telangana CMO | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సామాన్య ప్రజలకు ప్రతి సమాచారం నేరుగా అం దించాలని సర్కారు నిర్ణయించింది. పథకాల సమాచారం.. సేవలు సులభతరం చేసేందుకు సరికొత్తగా బుధవారం ‘తెలంగాణ సీఎంవో’ పేరిట వాట్సాప్ చానల్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా సీఎం కేసీఆర్ వార్తలు ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకొనే వీలుంటుంది.
దీనిని సీఎం పీఆర్వో సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభా గం నిర్వహిస్తున్నది. ఎవరైనా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు, ఈజీగా ఈ చానల్లో జాయిన్ కావచ్చు.