హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక బస్సు చొప్పున 553 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం రేవంత్ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో మంగళవారం మహిళా సంఘాలకు అందజేస్తారని పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక చెప్పారు.
రూ. 500 కోట్ల వడ్డీ రాయితీని సైతం మహిళలకు అందజేస్తారని తెలిపారు.